చరవాణి : samachara sarvaswam: vachana kavitha
చరవాణి : samachara sarvaswam: vachana kavitha
అంశం : చరవాణి 📱
~~~~~
🌹🍀🌹🍀🌹🍀🌹
💐శీర్షిక : సమాచార సర్వస్వం :
వచన కవిత సౌరభం
రచన రచన: కవీశ్వర్
తేదీ : 25 . 12 . 2021 .
హామీ పత్రం : ఈ కవిత నా స్వీయ రచన . ఎవరి అనుకర కానీ , అనుసరణ కానీ కాదు .
💐 శీర్షిక : సమాచార సర్వస్వం
కరాగ్రమున వసియించు పదార్థమా ! సర్వస్వ విజ్ఞానాన్ని కలిగిన బ్రహ్మానివా !
కరమధ్యమున విలసిల్లినట్టి వాగ్దేవివా !జ్ఞానేంద్రియములను ఉత్తేజపరిచితివా !
కర మూలమున తేజరిల్లు జగన్మాతవా ! కర్మేంద్రియముల క్రియా సమ్మోహినివా!
ప్రభాతము మొదలుగా నిషా రాత్రి హస్తమూలములందు కదలాడే అచిర వస్తువా !
జిజ్ఞాస ,ఉత్సాహ జ్ఞాన సముపార్జనకు సాధనముగా , నయనానందకరముగావెలసితివా !
కృత్యాధార పరికృతము తో గృహాకార్యం సల్పనిచ్చెదవా!విద్యార్థుల శిక్షణ తంత్రానివా !
సమాచార పరివర్తన క్రియలను పంపించే సాంకేతికానివా! సకల కార్యాలకు అనుసంధానివా!
యుక్తాయుక్త విచక్షణ చే సమన్వ య సహకారానివా ! జీవన విలువల మూలాన్ని విశదీకృతవా !
ఉపయోగిత లాభాలే కాకుండా నష్టాలకు కేంద్రబిందువా ! కాల హరణం , ధన హరణం కాదా !
నేరపూరితం,లోభ,కామ ఉత్తేజితం,క్రియా దోషమాశ్రితమా !మోసపూరిత కొట్లాటలకాదిమూలమా !
భావ వివర్జిత దూషణ , భాషణలే వివిధ ప్రజల క్రోధమా ! న్యాయస్థాన పయనానికి కేంద్రబిందువా !
నిరాశ ,నిస్పృహలచే , ఆత్మహత్యాసదృశమైన సాక్ష్యమా!కొందరికి క్రూర , దోష ప్రణాళికలసాధనమా !
వ్యాఖ్య : "ఇతరులకు అవరోధము, అన్యాయము , అవమానము , అసహనం కలిగించనంత వరకు
ఏ సాంకేతిక సాధనమైన మనకు ముద్దే ! అది కొంతవరకు హద్దే ! మిగితాది అసలే వద్దే !"
