STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

చర వాణి : Nitya sadhanam : kavitaa geyam

చర వాణి : Nitya sadhanam : kavitaa geyam

1 min
370

అంశం : చరవాణి :

 శీర్షిక : "నిత్య సాధనం" 

కవితా గేయం : 

కవీశ్వర్ : తేదీ :27: 12: 2021


శీర్షిక : "నిత్య సాధనం"

చుఱచుఱ చూపుల నిత్య సాధనం - చర చర ప్రాకే ఋణావేశం 

గబగబ చేసే సాంకేతిక అనువర్తనం -సరసరసాగే నిరంతర భాషణం 

చకచకనడిచే కమనీయ చిత్రరూపకం - పదపద మనెనే కార్య సాధనం 

నెఱనెఱ నెరిపే సకల కార్య సాధనం-చిఱచిఱ నెంచే జూమ్ సభామండపం 


భావన కలిగే దూర బాంధవం - చరవాణి తొలగించే ఒంటరి తనం

తన తోటిదే ఈ విచిత్ర లోకం - ప్రక్కన ఏమిజరిగినా తెలియని నైజం

సుదూర శ్రవణం , బహుదూర దర్శనం - దూర భాషణం , హస్త భూషణం

చరాచర సృష్టిలో చరవాణే విచిత్ర సాధనం - జ్ఞాన వర్ధనం సమాచార సేకరణం


 e తరగతి మొత్తం కరకమలం లో- e చదువుల సారం నీతోనే - 

నేర్పు , ఓర్పు , ప్రతిభ నీవల్లే - అవాస్తవ పరోక్ష ప్రతిబింబ పాటవం 

ప్రమోదాల చిరు సంయోజనం - పరీక్షలరచనా సులభ సాధనం 

పోటీల బహుముఖ ప్రజ్ఞ పాటవాలు - క్షణాల్లో నిర్ణయఫలితం 


పయనంలోదురుపయోగంనిత్యం వార్తాఅంశం-కలుగు ప్రమాదాల సమాహారం 

నష్ట పరచుఇతరుల జీవన శైలి - శిక్షణలేనిశిక్షలకు న్యాయస్థానాలవైపు పరుగెత్తడం 

ఉనికిలో ఉండి , శిక్షలు పొంది - విలువల మింగి , బాధల క్రుంగి అగమ్యగోచరం

చిత్రముగా బయటకు తీసుకువచ్చే పలుకుబడి - ఈ - చరవాణితోనే సాధ్యం !!!!! 


: జయంత్ కుమార్ కవీశ్వర్ . 



Rate this content
Log in

Similar telugu poem from Abstract