STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

చలి - దుప్పటి

చలి - దుప్పటి

1 min
215

గాలుల్ని కాస్త ఊరుకొమ్మని

నువ్వైనా చెప్పొచ్చు కదా

నీటిని కాస్త వేడి చేయమని

సూర్యుడితో చెప్పవా


ఓ వెన్నెలా

మరింత మంటను రగుల్చు

ప్రియుని కౌగిలి లేక

పలు విధముల దుఖించు సఖికి

రవంత విశ్రాంతి కలిగించు


తల దాచుకొనే వీలు లేక

తమను తాము ఏ వీధి మూలకో 

చెందిన వారుగా ఉండిపోయిన శరీరాలకు

కాస్త వేడి కలిగించు


వెచ్చటి కన్నీరు తెలియక

పరుష వాక్యముల బాధించు వారికి

కాస్త బుద్ధి కలిగేలా

కనువిప్పు కలిగించు


ఓ వెన్నెలా

ఇన్ని పనులు నీకుంటే

చలికి దుప్పటి కప్పుకుని

శిశిర కాలమున చెట్లను చూస్తున్న నన్ను

మళ్లీ మళ్లీ పిలిచెదవేల


ఏముందని నేను బయటికి రావాలి

ఎవరి విందులోనో గుప్పుమనే వార్తలా

అలా మిగల్లేక 

ఇలా ఉండనీ

నను నాతో పోరాడనీ



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract