చినవాల్తేరు కనకమ్మ తల్లి
చినవాల్తేరు కనకమ్మ తల్లి
తల్లీ!
ఏడేడు లోకాలను ఏలే శక్తివి నిత్యమూ
నిన్ను కీర్తించి మ్రొక్కితినే
అట్టి నన్ను దోషములంటిన
నీవు ఊరకుందువా
కోటి సూర్యుల వెలుగుగా
నిన్ను అభిషేకించిన
కుంకుమను నేను నొసట దాల్చితినే
బ్రహ్మాండమునే లిప్త పాటులో సృష్టించి కడతేర్చగలవు నీవు
గ్రహముల కాలముల కక్ష్యలలోని
కక్షలకి నన్ను వదిలివేయుదువా
అశనిపాతముల వలె వేధించు వ్యర్థ వాదనలు
కర్మ బంధములు పెనవేయు పాశములు
అన్నీ చుట్టు ముట్టిన నీవు గమనించకుందువా
నా కష్టములు తొలగించుట నీకు
గాక ఇంకెవ్వరికి సాధ్యమమ్మా
తాయే! మహా మాయే
సత్వరము నన్ను కరుణించ
ఆకాశ వీధిని దిగిరా
వేగిరము నేను చేయు స్తోత్ర నివేదనను
స్వీకరించి దోషములు తొలగించి
కరుణన్ మంగళములు చేకూర్చమ్మా సర్వమంగళా
చినవాల్తేరులో వెలసిన కనకమ్మా..