STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

మళ్లీ మొదట్నుంచి..

మళ్లీ మొదట్నుంచి..

1 min
6

ఇంకా ఏం నేర్పిస్తావ్

చేసిందంతా చాలదనా

ముగింపు లేని కథలా

మూలన ఉండి

అవసరం పడినప్పుడు నీ స్టవ్ తుడిచే మసిగుడ్డలా


ఇలానే ఉండమంటావా

ఏదైనా మనిద్దరికోసమే కదా

నాదంతా స్వార్థమని అనుకుంటే

ఆ స్వార్థానికి మూలం నువ్వే కదా

పట్టుచీరలతో బీరువాను నింపలేదా

పాత ముచ్చట్లు వినీ వినీ


టీవీ సీరియళ్లకు కూడా విసుగు వచ్చింది

సీరియల్ అయినా

సినిమా అయినా

నాకు నువ్వే హీరోయిన్ మరి

ఆమె నవ్వేసింది

నాకు తెలుసు నువ్వు మంచిదానివని

అంటూ అతను మురిపెంగా చూసాడు


ఇలా ఏదో ఒకటి చెప్పి

మళ్లీ నన్ను ఈ సంసారంలో బంధిస్తావు

అని ఆమె అతని చేతులను పక్కకు తోసింది

ఆమె గాజుల చప్పుళ్లలో

కాస్త బింకం

కాస్త కోపం


మళ్లీ ఓడిపోవాలా అనే సందేహం

అవన్నీ పట్టని అతని చేతులు

ఆమె శరీరం మీద మళ్లీ నాట్యం చేసాయి

ఎన్నిటికో మళ్లీ మొదలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract