STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

చీకటి ముసుకు

చీకటి ముసుకు

1 min
322


ముగ్ధ మోహన సౌందర్యారాశీ !

స్నిగ్ద సౌరుభ సుమవీచికా !

దాచలేదే ఆకాశం తన జాబిల్లిని ?

వెన్నెల చిరునవ్వు తో వెలిగిస్తూనే ఉంది విశ్వాన్ని...

దాచుకోలేదే తన శ్రావ్యతా కంఠాన్ని ఆ కోయిలమ్మ ?

ప్రకృతి వీనులకు విందు చేస్తూనే వుందే ?

దాచుకోలేదే తన నర్తనా కేళిని ఆ మరాళి ?

మేఘాల హృదయాన్ని కరిగించి

నేలకు శీతలాసాంత్వననిస్తూనే వుందే !

దాచుకుంటావెందుకు రమణీ 

,అల్లా ప్రసాదితమైన రమణీయ అందాన్ని 

ఆ చీకటి ముసుకులో ?

కప్పుకుంటావెందుకు మబ్బుల దుప్పటిని ? 

నీ కాటుక కన్నులతో వెన్నెలదీపాన్ని వెలిగించు

ఈ కటిక చీకటి జగతిలో....

నీ మందార మకరంద అధరాలతో

పెంచవెందుకు ప్రకృతి సౌందర్యాన్ని మరింతగా ?

నీ నవ్వుల ఘుమ ఘుమలతో

కలుషిత వాయువులను 

నిర్మల మలయ మారుతారులగా మార్చవేమి ?,

ఏ దైవం చెప్పాడు దాచుకో నీ అందాన్నని ?, 

ఇది మగాడి కుటిల స్వార్ధ సృష్టి !

అంగనామణి అణిచి వేతకు పంకాస్త్రం!

ఆనాటి నీవు నీవుకాదీనాడు

అంతటా వ్యాపించి అంతర్యామివైనావు

కిసాను నీవే సిపాయి నీవే

జగద్రక్షకీ నీవే జగద్భక్షకీ కూడా నీవే

తెలుసుకోవేం నిన్ను నీవు ? 

అభిమానాన్ని హత్య చేసి బానిసగా వుంటావేం?

త్రెంచుకో ఆ ఉక్కుసంకెలలను..

చీకటి ముసుగు తీసి

ప్రజ్వలిస్తున్న మంటలలో దహనం చేసేయ్ !

రా చెల్లెమ్మా రా !

జన చైతన్యంతో కలిసిపో

మగ దాష్టీకాన్ని మట్టు పెట్టు



Rate this content
Log in

Similar telugu poem from Romance