చిదానంద గోవిందం
చిదానంద గోవిందం


నీవే మా అందాల చిరునవ్వుల చిదానంద గోవిందం,
నీవే మా మురిపపు మురహర మురళీధర ముకుందం,
నీ నామస్మరణం ఎప్పుడూ కలిగించెను పరమానందం,
సదైవం నయనానందకరం నీ మనోహర ముఖారవిందం ।౧।
నీ చరణారవిందాలలో నా అంతఃకరణం వేడుకొనెను శరణం,
నీవే బోధించావు భవ్యమైన భగవద్గీత ఆచరణం అనుసరణం,
నీ దిశానిర్దేదేశంతో విజయవంతం అయ్యెను నా జీవన రణం,
నీ భక్తిమార్గం కర్తవ్యపరాయణ మార్గమే సర్వదుఃఖ నివారణం ।౨।
ఆద్యంత మధ్యాంత రహితం నీ నామకరణం,
నీ మకరంద నామమే ఒక ఆయతన ఆవరణం,
లోకకళ్యాణంచే నీవు సదా అభినవ ఆశాకిరణం,
నీ అనుబంధమే నిత్య కళ్యాణం పచ్చ తోరణం ।౩।