ఛీ... పాడు... శ్రీనివాస భారతి
ఛీ... పాడు... శ్రీనివాస భారతి


పెదాలకు
లిప్స్టిక్కులు పూసి
మాటల్లో విషం నింపి
మనసుల్ని కలుషితం చేసే
సీరియల్ నిర్మాతలూ
పావలాకు
పదిరూపాయల
దొంగ ఏడ్పుల్ని కార్చికార్చి
అత్తా కోడళ్ల
తోటికోడల్ల.. తంపులు చూపి
గల్లా పెట్టెలు నింపుకుపోతే
ఆడోళ్ళని ఆడిద్దాం
కుటుంబం చెడగొడదాం
గదికో టీవీ పెట్టి
మనుషుల్ని చీల్చేద్దాం
మత్తు లా సీరియల్స్ జల్లి
కుటుంబ విలువలు తుడిచేద్దాం
మనం బ్రతికితే చాలు
ఎవరెలా పోతే మనకేం
పోషక విలువలు, ఆరోగ్యాలు
చదువు జ్ఞానం వదిలేద్దాం
వెర్రి డాన్సులు, వెకిలి చేష్టలు
అన్ని బుర్రలకు ఎక్కిద్దాం
రాత్రి వేళ
ఆప్యాయతకు అడ్డుకట్ట వేసి
ఏదో ఒకటి వొండి పడేసి
మందులేసుకున్నా సరే
సీరియల్ టానిక్ తాగాల్సిందే
ఉదయం నుండి నైటీ మునకలు
ఎండ తగలని పట్నం బ్రతుకులు
రోజూ చీరల మోజుల చూపులు
వెర్రి మొర్రి ఊహల బుర్రలు
వృధా అయ్యే ఎన్నో గంటలు
◆◆◆◆®®®®®®◆◆◆◆