చెత్త బాబోయ్ చెత్త
చెత్త బాబోయ్ చెత్త


నిదుర లేచి చూస్తే,
బెడ్ పైన చెత్త,
బయటికి వెళ్ళి చూస్తే,
రోడ్డు మీద చెత్త,
ఆఫీసుకి వెళితే
అక్కడా చెత్త,
గుడిలో బడిలో,
నదిలో అంబుధిలో,
దేన్నీ వదలకుండా
మనం అన్నింటిలో చెత్త వేసి,
ఇప్పుడు చెత్త బాబోయ్ చెత్త,
అని అరిస్తే ఏం లాభం.