చెలి చిలక
చెలి చిలక
చెలి చిలక... వలపుల మెలిక... కన్నె మందార మొలక... స్వాతి చినుకా... స్వాగతించనీ నీ ప్రేమని...
నన్నే చేరి మనసు దోచిన మానస చోరి...
నీ జతనై తోడుంటా చెలి...
చిటపట చినుకుల తడి...
చిరునవ్వుల వలపుల సడి...
చెలియ చిరు మువ్వల సవ్వడి...
నా మనసంతా ప్రేమ సందడి...
నీకై నా పయనం అని...
నా లోకం నువ్వే అని...
సంపెగల వాగులోన పయనించని...
వెలుగు పూల ప్రవాహంలో జలకమాడని..
నీ వెంటే తోడునై మన ప్రేమ బంధాన్ని అమృతంలా చిలకనీ...
చెంత చేరవే చెలియా చేయి జార్చకు ఈ మనసుని...
చెలి చిలక... వలపుల మెలిక... కన్నె మందార మొలక... స్వాతి చినుకా... స్వాగతించనీ నీ ప్రేమని...