STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

బ్రతుకు

బ్రతుకు

1 min
10



సంపాదనె ధ్యేయమనే భావనలూ రానీయకు
సంతానము బాగుకొరకు నీపరువుని పోనీయకు

ఎంతమంది ఎన్నోచెప్పి ఊబిలోకి లాగిననూ
చివరంటా బ్రతుకునిచ్చు నీతన్నది విడనాడకు

మనిషికైన మనసుకైన నిబ్బరమన్నది ముఖ్యం 
గాలికంటె వేగమైన ఏపడతిని మనువాడకు

ఆత్మగౌరవముంటేనే మనిషికి మనుగడ సాధ్యం
లిప్తపాటు సౌఖ్యాలకు నీవెపుడూ దిగజారకు

ప్రేమించే మనసుంటే ధైర్యాన్ని ప్రదర్శించు
కనిపించని చీకటిలో ఏభామకు కనుగీటకు


Rate this content
Log in

Similar telugu poem from Classics