STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

బ్రతుకు బాటలో

బ్రతుకు బాటలో

1 min
378

గడచిపోయిన కాలం గంగ కలిసిన నీరు కాదు

నేర్చుకున్న పాఠం నేలకు ఒలికిన బీరు కాదు

అనుభవ మెన్నడు బూడిదయిన సిగరెట్ కాదు

జీవిత మెన్నడు దారం తెగిన గాలిపటం కాదు

 సుఖమిస్తుందని శాశ్వత నిద్ర పనికి రాదుగా

పొందు సుఖమిస్తుందని బలవంతపుది కాదుగా

విందు ఉచితమే కానీ అజీర్తిచెయ్య కష్ట తరమేగా

బరువు మోయలేని ధనం మూట పరుల పాలేగా;

పాలనుంచీ వెన్న కావాలంటే పద్ధతంటూ ఉన్నది

ప్రాణం సుఖంగా ఉండాలంటే పద్ధతంటూ ఉన్నది

సరయిన విత్తు తరాలకు ఫలమందిస్తూ ఉంటుంది

నీ పెంపకం మంచిదైతే నీ వంశమట్లే పెరుగుతుంది;



Rate this content
Log in

Similar telugu poem from Inspirational