బ్రహ్మ విద్య
బ్రహ్మ విద్య


ఒక చెట్టుతొ ఒక పక్షితొ..మాటాడుట బ్రహ్మవిద్య..!
అదేపనిగ నిన్నునీవు..గమనించుట బ్రహ్మవిద్య..!
ఏ పూవులు కోస్తావట..ఏ దేవుని పూజింపగ..
కాంతిపూల తోటలలో..విహరించుట బ్రహ్మవిద్య..!
దేనికైన బాధెందుకు..ప్రయోజనం ఏమున్నది..
చిరునవ్వుల సెలయేఱుగ..జీవించుట బ్రహ్మవిద్య..!
ఒక వెన్నెల పాటలాగ..మనసు ఎప్పుడయ్యేనట..
నాటకమని తెలిసితెలిసి..మసలుకొనుట బ్రహ్మవిద్య..!
ఆటాడే పనేలేదు..ఆటసాక్షి కావడమే..
నిశ్చలాగ్ని వానలోన..నిలచుండుట బ్రహ్మవిద్య..!