STORYMIRROR

ARJUNAIAH NARRA

Action Inspirational

4  

ARJUNAIAH NARRA

Action Inspirational

బహుజనులరాజ్యాధికారం

బహుజనులరాజ్యాధికారం

1 min
380


బుద్ధుని సమతా వాదాన్ని

మహాత్మ ఫూలే తాత్వికతను

బుకర్ టి వాషింగ్టన్ మానవ హాక్కుల ఉద్యమాన్ని

డ్యూయి, బార్క్, లాస్కీ, రెనడేల నైతికతను

రాజనీతి తత్వన్ని అవపొసన పట్టి

అమెరికా కొలంబియా, లండన్, జర్మనీ

విద్యాలయాల్లో చదివి వచ్చి


సమాజంలో వెలికి గురియైన

సమూహాలకు అస్థిత్వ చైతన్యాన్ని

వెలింగించి వెలికి మూల శత్రువైన 

బ్రహ్మణవాదం, మనుస్మృతిని

కాల్చివేసి రాజ్యాధికారం సిద్ధాంతాన్ని

రాసిచ్చి వేళ్ళాడు


బహుజనుల రాజ్యాధికారం రావాలంటే

అంటరాని కులాలు ఐక్య శక్తియై 

ప్రత్యేమ్నాయా శక్తిగా ఎదగాలి

పురాణ వేద భావజాలం విస్మరించాలి

పూజలు, అరాధనాలను మానివేయాలి

బౌద్ధ ధమ్మాన్ని సంస్కృతిని స్వీకరించి

పునర్జన్మ, కర్మ, ఆత్మ, పరమాత్మలను తిరస్కరించి

స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వ పునాదితో

మానవత్వ సిద్ధాంతంతో నవ సమాజాన్నీ నిర్మించాలి


నిన్న అనుకున్నవి నేడు జరుగుతాయి

నేడు అనుకున్నవి రేపు జరుగకపోవచ్చు కానీ

ఈ జీవన సమరంలో బహుజనుల రాజ్యాధికారం

పొందేవరకు పోరాడుదాం సంఘటిత కండి

పోరాడితే పోయేదేమిలేదు బానిస సంకెళ్లు తప్ప

చివరి సలహా...భోధించు...పోరాడు..సమీకరించు....

నీలో నీకు విశ్వాసాముంచు,నమ్మకం కోల్పోకూ....



Rate this content
Log in

Similar telugu poem from Action