భోగి పండుగ
భోగి పండుగ
వచ్చిందండి వచ్చింది,
పెద్ద పండుగ వేళ వచ్చింది,
ఉత్సవాలు చూసే వేళ వచ్చింది,
ధగధగలాడే భోగి పండుగ వచ్చింది !!
పైరుపంటల పని చూద్దాం రారండి ,
భగభగలాడే భోగి మంటలు చూడండి,
రుద్ర గీత జ్ఞాన యాగాన్ని తిలకించండి,
భోగభాగ్యాలు వైవిధ్య వైభోగాలు పొందండి,
ఆంధ్ర ముంగిళ్ళలో ముత్యాలముగ్గులు వీక్షించండి,
చిన్నపిల్లల భోగిపండ్ల పండుగ పాటలు ఆలకించండి,
ఆంధ్రుల లోగిళ్ళలో గొబ్బెమ్మల అందాన్ని ఆస్వాదించండి,
రుచికర పొంగళ్ళు రకరకాల పిండివంటలు విందులు ఆరగించండి !!
కోలాటం కోలాహలం హళాహళి విని ఆనందించండి,
అనూహ్యం అసదృశం ఈ సరదా సంబరాల సందడి,
ఈ పెద్ద పండుగ తొలిరోజు వేడుకలు చూసి తరించండి,
ఏటేటా ఈ సుషమ సంరంభాలతో పరవశించి పులకించండి !!
వచ్చే తరానికి ఈ వెలలేని వారసత్వపు ఆనవాయితి అందించండి,
తరతరాలకు ఈ సాంస్కృతిక సాంప్రదాయికమైన సంపద అప్పగించండి !!