"నా ప్రపంచం"
"నా ప్రపంచం"
భలే ప్రపంచం..! భలే ప్రపంచం..!! భలే ప్రపంచం..!!!
బ్రతికుండంగా మూసేస్తూ,
మరణించాక మోసేస్తుందోయ్.
ఇది బంధ మకరంధమెరుగని ప్రపంచమోయ్!
ఇది అంద చందమెరుగని ప్రపంచమోయ్!!
భలే ప్రపంచం..! భలే ప్రపంచం..!! భలే ప్రపంచం..!!!
ముందునుంటూ వాటేస్తూ,
యెనకనుంటూ కాటేస్తుందోయ్.
ఇది ఒదిగుంటే కప్పే ప్రపంచమోయ్!
ఇది ఎదుగుతుంటే తొక్కే ప్రపంచమోయ్!!
భలే ప్రపంచం..! భలే ప్రపంచం..!! భలే ప్రపంచం..!!!
చిరునవ్వుతో పలకరిస్తూ,
అసూయలా దహిస్తుందోయ్.
ఇది నమ్మకమెరుగని ప్రపంచమోయ్!
ఇది విలువలెరగని ప్రపంచమోయ్!!
భలే ప్రపంచం..! భలే ప్రపంచం..!! భలే ప్రపంచం..!!!
మాటలో మంచిని ఆక్షేపిస్తూ,
కాసుల సంచికి ఆరటపడుతుందోయ్.
ఇది నిజాయితీని నొక్కే ప్రపంచమోయ్!
ఇది కపట బుద్ధిని మొక్కే ప్రపంచమోయ్!!
భలే ప్రపంచం..! భలే ప్రపంచం..!! భలే ప్రపంచం..!!!
✍️సత్య పవన్✍️