STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

భావిభ మార్గ దర్శనం : సమాజ సేవ - దేశ సేవ : కవీశ్వర్ : 06 .04.23

భావిభ మార్గ దర్శనం : సమాజ సేవ - దేశ సేవ : కవీశ్వర్ : 06 .04.23

1 min
256

 

భావిభ మార్గ దర్శనం - సమాజ సేవ - దేశ సేవ 

వచన కవిత గీతం : కవీశ్వర్ : 06 .04. 2023 .

౧. పరాయి దేశస్తుల పాలన పారద్రోలిన స్వీయ పరిశ్రమా 

ఉద్యమాల చేయూతచే దేశ స్వాతంత్య్ర సిద్ధి కార్యమా 

మున్షి నాటిన జ్ఞాన మొలక వటవృక్షము వలే వేళ్లూనెనే

భారతీయ విద్యాభవనం దేశ-విదేశ మంతటా విస్తరిల్లెనే

౨. రాజ్యాంగ ప్రణాళికదేశమునమార్గ దర్శనం గావింపబడెనే 

రాజ్య విలీన కార్యమునందున ఉక్కు మనిషి తోడ్పడెనే 

కేంద్రమంత్రాంగములో ఖాద్యశాఖతో పర్యావరణాన్నిఎంచెనే 

వనమహోత్సవ ప్రక్రియకు హరిత భారతిని రమ్యముగా పెంచె నే 

౩ . మంచి తలపులు అన్ని మార్గములందుజనియించెనే 

సాంస్కృతిక కళామ తల్లికి సకల సేవలు ఇల సల్పెనే

రచనా - కౌశల విద్యాలక్ష్మిని విశ్వ వ్యాప్తి వడిగావించెనే 

గతము నుండి వర్తమాన- భవిష్య మార్గము నెంచిచూపేనే 

౪. విశ్వమంతా కుటుంబము వలే పూర్ణ సంస్థను నెలకొల్పెనే 

దీని సేవలను గుర్తించి ప్రభుత్వ చేయూత నందించవలెనే 

యువత ఉజ్వల భవితకుతగు కుసుమ మార్గము చూపవలెనే 

నిరంతర సేవలతో సంస్థ సమాజ హితమున సదా పాటుపడెనే 

కే.ఎం. మున్షి యాది లో ఈ వచన కవిత ను రచియించితిని.


Rate this content
Log in

Similar telugu poem from Action