భారతీయులం
భారతీయులం
చేయి చేయి కలుపుదాం, మున్ముందుకు సాగుదాం,
సాగుదాం అవరోధాలను, అడ్డంకులను అధిగమించి,
అధిగమించి సైనికులుగా, దేశ రక్షణకై, శత్రువులతో పోరాడుదాం,
పోరాడుదాం, పటిమ చూపి, శత్రుమూకను దునుమాడుదాం,
దునుమాడుదాం రక్కసి మూకను, రక్షక భటులమై శాంతి భద్రతలను కాపాడుదాం,
కాపాడుదాం, ఆగడాలు చేసే దుండగులను పట్టి శిక్షించుదాం,
శిక్షించుదాం, మరల మరల వారిని రానీయక పారద్రోలుదాం,
పారద్రోలుదాం, వైద్యులమై రోగులకు సేవచేసి, అనారోగ్యం,
అనారోగ్యం ఏదైనా, ఎలాంటి మహమ్మారితో నైనా పోరాడి, తరిమికొడదాం,
తరిమికొడదాం కుహనా నాయకలను, ఏకమై మనమంతా, దేశసమగ్రతకై,
దేశసమగ్రతకై, రాజకీయ నాయకులమై, ఐక్యతను సాదిధ్ధాం,
సాధిద్దాం, దేశమంతటినీ ఒక మాటపై నిలిపి, సమైక్యతను చాటుదాం,
సమైక్యతతో మన ప్రజల పురోగతికి బాటలువేద్దాం,
బాటలువేద్దాం, ప్రజల పురోగతితో, దేశాభివృద్ధికి
పాటుపడదాం,
పాటుపడదాం, యువసారథులకు, దేశ పగ్గాలిచ్చి, పునాదివేద్దాం,
పునాదివేద్దాం, నవభారత నిర్మాణ దిశగా సాగి, భారతీయతను చాటుదాం.
