బాటసారి...
బాటసారి...
కన్నీరు నాకు కొత్తాకాదు
బాధంటే భయమూలేదు
బ్రతుకు మీద తీపీరాదు
బాధ్యతల భారం చావనీయదు
సుడిగుండాలనదిలో
చుక్కానిలేని నావలో
పయనం సాగుతున్న బాటసారిని
గాలివాటుకు వాలిపోతున్నా
తుదకు దైవమే కడకు చేర్చునో
ఎదురుచూస్తూ కాలము వెలార్చుతున్నా....
..., సిరి ✍️
