STORYMIRROR

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Tragedy Inspirational Others

బాపూ! ఎక్కడ నీ స్వరాజ్యం?

బాపూ! ఎక్కడ నీ స్వరాజ్యం?

1 min
310

బాపూ..

మనసేమీ బాలేదు

మనీషానే మెదులుతోంది ఎదుట

రామరాజ్యం కాస్త

కామరాజ్యంగా మారుతోంది

నాలుక తెగ్గోసిన

నరరూప రాక్షసుడిని

ఖండఖండాలుగ కోసి

ఖండాంతరాలకు విసిరేయాలనుంది..

నరాలు చిట్లేలా చిదిమేసిన

చండాలుడిని చీల్చి

చెట్టుకు పుట్టకు వేలాడేయాలనుంది..

ఆడపిల్ల అవయవాలతో

వికృత క్రీడలాడిన

వింత మృగ మగాళ్ళను

ఉరి వేసి చంపేయాలనుంది..

లేడిపిల్ల ను చిరుతలు వెంటాడి

లాక్కెళ్లి నట్టు అభాగ్యురాలిని

ఈడ్చుకెళ్ళి పైశాచికానికి పాల్పడిన

ఆ నలుగురూ నరకం అంటే

ఏంటో అనుభవించాలి..

వెర్రి లోకం వెన్ను విరిచి

వికటాట్టహాసం చేస్తుంది..

మానం హరించి పానం తీసిన

పాపిష్టి ప్రపంచం మరణాన్ని

ముక్తి గా ప్రసాదించింది..

ఎక్కడుంది బాపు

నువు సాధించిన స్వరాజ్యం..

నువు చెప్పిన అహింసో పరమ ధర్మః

మంత్రం వల్లించలేనిక..

నువు చూపిన సత్యమేవ జయతే

మార్గం నడవలేనిక..

నీ ఆదర్శాలకు తిలోదకాలిచ్చిన

ఈ లోకాన్ని క్షమించలేనిక..

దుఃఖనదిలో ఈదుతున్న ఎందరో

ఆడబిడ్డల ఉపశమనానికై

మరో ఆడపిల్ల బలికాక ముందే

వనితనై..ధీర వనితనై..

లోకాన్ని చదవడానికై

ధైర్యసాహసాలే ఆభరణాలుగా ధరించి

అంగాంగాలనే ఆయుధాలుగా మలిచి

బయలుదేరుతున్నాను..

ఎదురొచ్చిన మృగాన్ని

మట్టుపెట్టడానికి...

మగువల తెగువను నిరూపించడానికి..


Rate this content
Log in

Similar telugu poem from Tragedy