బాలికలం బలికాము
బాలికలం బలికాము


కలం పట్టి అక్షరాలతో....
అద్భుతమైన కథనాలు రాశి రాసి
చదువులో చంద్రబింబమై
విద్యావినీలాకాశంలో వెలుగుతాం
గరిట పట్టి వంటగదిలో...వంటల
గుభాళింపుతో గుమగుమలు
పండించి...అందరికీ పౌష్టికాహారం
అందించి అన్నపూర్ణలు అవుతాం
గర్ల్స్ కదా అని వక్రంగా చూడొద్దు
గన్ పట్టి ప్రతి అడ్డగాడిదనూ...
కాల్చి కాకులకూ గ్రద్దలకూ వేసేస్తాం
మీ పాపం పెరిగితే మా కోపం!!!???
ఆకాశమే మా సరిహద్దు
అవకాశాలు అసలు వదలం
అన్ని రంగాలలోనూ ముందుంటాం
అమ్మాయిలే మెరుగు అనిపిస్తాం
బహుముఖ ప్రజ్ఞ మాసొంతం
ఓపికలో భూదేవి...నేర్పులో నింగి
పంచభూతాలు మా అనుచరులే
అందుకే "అబ్బాయులూ" జర జాగ్రత్త
మీరూ మేమూ సమానమే
మనం మంచి స్నేహితులం అయితే
సర్వ వ్యవస్థల్లో ప్రగతి విమానమే
సమాజానికి సంతోషమే గర్వకారణమే