STORYMIRROR

ARJUNAIAH NARRA

Romance Fantasy Inspirational

4  

ARJUNAIAH NARRA

Romance Fantasy Inspirational

అవని, ఆమని నేనో కవిని

అవని, ఆమని నేనో కవిని

1 min
669


(ఉగాది శుభాకాంక్షలు)


ఆమనిని ఏమని వర్ణింతును నేను

అవనిని హరివిల్లుగా మార్చెను చూడు


చిరుజల్లులు కురిపించి పొదరిల్లుగా పరిచి

చిరునవ్వులు చిందించి ఇంద్రధనస్సుల సారించి

పొలములన్ని హాలములతో దున్నేను రైతు

అడవులలో చిరు జీవుల అడుగులు పడెను 

తరువులు కల్పవృక్షములై ఎదురు పడెను

ఎరులు బతుకు దెరువులై పారేను నేడు //ఆమనిని//


చిగురాకుల టపటపలు,

చిరు చినుకులు చిటపటలు 

కొండకోన, వాగు వంక, సెను సెలుక, గుట్ట, పుట్ట,

సెలిమలు, సరస్సులు, నదులు, సముద్ర తీరాలు, లోయల మలుపులో వయ్యారి నడుము వంపులతో  

గంగ తరంగ పుడమి నిండ అంగరంగా వైభవంగా పారంగా //అమనిని//


తీగల పాగలు, మొగలి పొదలు, మోదుగురంగులు

కనకంబర, బంతి, చేమంతి, మందార మాలికాలు

దిరిసేన, తామర , కుసుమ, కలువల మోములు

పొగడ, పున్నగా, గుల్మోహరా, పువ్వుల నవ్వులు

సంపెంగ, సన్నజాజి, పారిజాత పరిమళాలు               

  //ఆమనిని //          


తుమ్మెదల గానం, తేనెల ప్రవాహం,

మామి చివుళ్ళ పులుపు, కోకిల పాటల పిలుపు

పక్షుల కోలహాలం, లతల సమాహారం

పఛ్చని ఆకులు, రంగుల సీతకొక చిలుకలు

తరువుల సోయగాలు, విహంగల నాదాలు 

కనులకు విందు, మనసుకు పసందు,  

//ఆమనిని//


చిలక కోరిన జామ, చింత చిగురు కోరిన భామా

చెరుకు గడ తీపి, లేలేత ముంజల సుర

మామిడి తొక్కులు, పనస తొనలు

పిల్ల గాలులు, మల్లె పూవులు

పూలు పండ్లతో వొళ్ళు విరిసే వనాలు

మధురస పానీయాలు, సుమధుర గానాలు

అరవింద వనం మకరందపానం  //అమని//


వరి పైరు తళతళ, సెలయేర్ల గళ గళ

ఎర్రని మొగ్గలు, తెల్లని మబ్బులు,

గులాబీల బుగ్గలు, సింధురపు సిగ్గులు

చల్లని గాలి, వెన్నెల హాయి,

తీయ్యని రేయి, కమ్మని నిద్రనోయి //ఆమనిని //


వసంతపు హిందోళ రాగాలు

ప్రియసఖులకు విరహ గీతాలు

యువకుల పలుకులు, యువతుల కులుకులు

నవ్వుల తళుకులు, నుగారు సొగసులను


బంగారు కాంతి రేఖల ఉదయాలను 

నుదుట సిందూర తిలకంగా దిద్దుకొని

ఏడూ రంగులన్నీ మోము పైన గోరంటకుగా పెట్టుకొని 

విరిసిన విరులన్ని తన కురులందు తురుముకొని 

అవని వాలు జడసిగలో ముద్దుగా ముడి వేసుకుని

ఎన్నో ఆశలతో, వూసులతో, 

తలపులతో, లయలతో, హోయాలతో, 

మాయలతో, కస్తూరి పరిమళంతో 

కొత్త కోరికలకు చివుళ్ళు మొలిపించి

ఆమని అవనిని హరివిల్లుగా మార్చింది

//అమనిని//


//ఉగాది శుభాకాంక్షలు//


9.04.2021.


 



Rate this content
Log in

Similar telugu poem from Romance