STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

అసలే చలికాలం!

అసలే చలికాలం!

1 min
559

మెల్లిగా 

తెలిసీ తెలియక

దుప్పటి పక్కకు జరిగింది

నాకేమో చలేస్తోంది

నిన్ను దుప్పటిలా కప్పుకోవాలనిపించింది

నువ్వు ఒప్పుకుంటేగా


అసలే చలికాలం

ఓ వైపు ఏసీ వేస్తావు

కానీ కౌగలించుకోనీవు

ఇక నిద్ర ఎలా పడుతుంది


మన మంచాల మధ్య దూరం

విరహపు వేళల అనంతం

అంతలా ఇష్టం లేనప్పుడు

ఇంతలా కవ్వించడమెందుకు

నా ఆలోచనలతో ఆడుకోవడమెందుకు

చలిమంటల్లో నా కోరికల్ని కాల్చడమెందుకు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract