STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Action

4  

Dinakar Reddy

Abstract Drama Action

అరకు అందాలు

అరకు అందాలు

1 min
326

వెతికే కొద్దీ పలకరించే చెట్లు

దూరంగా ఎక్కడో

జలపాతాల సవ్వళ్లు

దగ్గరైన కొద్దీ మనలో ఏదో ఆనందం

నీటిలో కేరింతలు

పూల తోటలు

తేనె సీసాలు


ఆదివాసీల జీవన చిత్రాన్ని

అపురూపంగా దాచిన మ్యూజియం

ఆ పక్కనే కాఫీకి సమయం


అందరూ రుచి చూడాలి

అని తీసుకునే బొంగులో చికెన్

అనంతగిరి కాఫీ తోటల్లో పరిమళం



ఆగుతూ వెళుతూ

సెల్ ఫోన్ కెమెరాల్లో జ్ఞాపకాల్ని చేరుస్తూ

టెంట్ వేసుకొని

తెల్లవారి పొగమంచులో ఉఫ్ ఉఫ్ అనే శ్వాసని వదుల్తూ

ఎందరున్నా ఒక్కరే ప్రకృతిలో ఉన్నట్టు

ఇలాంటి జ్ఞాపకం మళ్లీ దొరకదు అన్నట్టు


చలిమంట కాచుకుంటూ

తలా ఓ కుళ్ళు జోకు వేసుకుని

మరికొన్ని సంగతులు తలచుకుని

జీవితం ఎంత సీరియస్ గా గడిపేసామో అని నవ్వుకుని

మళ్లీ ఇలాంటి యాత్ర ఒకటి చేయాలి 

అని అనుకుంటూ


అరకుకి ధన్యవాదాలు చెప్పి

నగరం వైపు బయలుదేరాం



Rate this content
Log in

Similar telugu poem from Abstract