అపవాదం అపశబ్దం
అపవాదం అపశబ్దం


తెలిసి తెలియనివారు వినిపిస్తారు కర్ణ కఠోర కర్కశ అపవాదం,
అందరి అనుచిత వాదం తోటి చేయలేము వ్యర్థ ప్రతివాదం,
మదాంధ మదచిత్తులై సృష్టిస్తారు అనవసరమైన ఉన్మాదం,
కడకు మిగులుస్తారు విరసమైన విరక్తికరమైన విషమ విషాదం |౧|
చిత్తము చిదపటానికి చీల్చటానికి చాలును ఒక అన్యాయ పదం,
మండేగుండెల్లో రగిలిన సుడిగుండం చేసెను ఆర్తితో ఆర్తనాదం,
ఈ అప్రియమైన ఆఘాతానికి పదాలలో చెయ్యలేము అనువాదం,
అనూహ్య చెడు చేదు అనుభవాలతో వచ్చెను ఆలోచనలో భేదం |౨|
కొంతమంది నోట ఎప్పుడు ఉంటుంది అయిష్టమైన అపశబ్దం,
విన్న అనంతరం ఆరంభమయ్యెను అసహ్యమైన వాదోపవాదం,
అందమైన బాంధవ్యాలలో దూరమయ్యెను ఆమోదం ప్రమోదం,
అపవాదం అపశబ్దంలో దుర్భాషి వెతుకును అవస్థపెట్టే ఆనందం |౩|