STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

అపురూప సంగమం

అపురూప సంగమం

1 min
315

పట్టుబడక జారిపోతున్న ఆలోచనలే...

కలకు - వాస్తవానికి మధ్య

అప్పుడప్పుడు చిక్కుబడిపోతూ

సంయమనాన్ని శోధిస్తుంటాయి..


ఆనందం హేతువుని వెదికేలోపు

దుఃఖం అనాయాస ప్రవేశం..!

పోగొట్టుకున్నదేదో శూన్యంలో తప్పిపోతే

కాలంతో గిరికీలు అనివార్యమే..!


మదికి నదికి ముడిపెట్టాక

ఒరిపిడి ప్రవాహానికే అలసట..!

ఏకాంతం ఓ ద్వీపమై అగుపడితే

మనసు పడవ నిశ్శబ్దపు లంగరు వేసుకుంటుంది.


మనసు మట్టిలా మూగదైపోవాల్సిందే..!

గుండెలో వేళ్ళూనుకున్న గతం వదలకున్నా

జ్ఞాపకాల ఆకులను రాల్చుకుంటూ

ఎదభారాన్ని సున్నితంగా తడుముకుంటూ...


తలపుల తరంగిణి ఆహ్లాదాన్ని మోసుకొస్తూ

నిశ్శబ్ద ప్రవాహానికి ఓ కట్టుబాటు నేర్పుతుంది..

ఎగిసిపడే భావాలను అక్షరీకరిస్తూ

అనంత భావజలధిలో

అపురూప సంగమమయ్యేందుకు 

ఓ ఒడంబడిక చేసుకుంటూ...



Rate this content
Log in

Similar telugu poem from Inspirational