అనుకోని ప్రమాదం
అనుకోని ప్రమాదం
అడుగు తీసి అడుగు వేసే లోపు
అడగకుండానే కోరి వరించినట్లు
అనుకోని ప్రమాదం పలకరించింది
అచ్చెరువు చెంది
చేష్టలుడిగి చూడాలా
బుద్ధికి పని చెప్పాలా
ఎలా తెలిసింది
కంటి పుసుల నుండి
కణ నిర్మాణపు పరిశోధనలా
నను లోతుగా పరిశీలించి
తీతువు కూతల చల్లబరిచి
చుట్టుముట్టిన ప్రచండ మారుతమా
భయానక దృశ్యముల సమూహమా
వివశుడిని చేయు సమ్మోహనమా
ప్రణయపు విశృంఖల రూపమా
నిన్నేమని పిలువను
చిట్టచివరకు జల్లబడు బూడిదనా
ఆ బూడిద చల్లినప్పుడు పొందు ప్రశాంతతనా
ఇంకా మాయలు ఆపవా
తలపుల వాకిట నిన్ను నిలుపలేను
ప్రమాదంలా వచ్చిన నువ్వు
ప్రమోదంలా మారి
ఇక నను విడిచి వెళ్ళు
తొలగించు ఈ బానిస సంకెళ్లు
