అనుభవం నిద్రపోతుంటే
అనుభవం నిద్రపోతుంటే
అనుభవం నిద్రపోతుంటే...!
మొన్నటి అనుభవం నిన్నటి పాఠం
నేడు మరిచిన వాచకం
గుణ పాఠంలో గుణం మైనస్
పాఠం రూపం మార్చుకొని
నెత్తిన ముండ్లు పరుస్తున్నది
భూతకాలఫాసిజం పునరావృతం
వర్తమానానికి హామీలు జిలేబీ చుట్టలు
చుట్టలలో తీపి గాయబ్
బతుకు మొట్టికాయలు తింటనే ఉంది
అభివృద్ధి తీసివేతే
ప్రగతి ప్రయోగాలు భాగహారాలే
సరికొత్త జవాబుదారీతనం పురాణాలు వల్లెవేస్తున్నది
జవాబుదారీ తనం నిఘంటువులో పత్తా దొరకడంలేదు
అంచెనల నిచ్చెనమెట్లు రిపేరులో కూడా కనిపించడం లేదు
రాబందుల పహరా కీళ్లు పగులగొడున్నది
సంక్షేమ ప్రగతికి నత్తలు ట్రైనింగు ఇస్తున్నయి
అనుభవం నిద్రపోతుంటే జరిగే కథ ఇదే
