అంతర్మధనం
అంతర్మధనం
మల్లె పువ్వును ముద్దుగుమ్మలు మరచితిరని ముడుచుకు పోయాయి
సన్నజాజులు సతుల సిగలే సన్నగిల్లాయని సద్దు మనిగి పోయాయి
చేమంతులు,ముద్దబంతులు ఇంతుల వాలుజడ జాడనే ఎరుగనన్నాయి
సంపంగెల పాళీలకు జడలే వయాసీసులయ్యాయి
గులాభీలు ఒదగడానిక జడ అల్లికలే లేక గుభాలించలేకపోతున్నాయి
విరజాజులు విరబోసిన కేశాలను చూసి విస్తుబోయాయి
జడలే లేని ఈ జనావాసాన తమ ఉనికిని కోల్పోతున్న
ఈ పూబంతుల అంతర్మధనం అర్ధమయ్యేది ఎందరికో మరి!