అంతర్జాలం
అంతర్జాలం
అదేంటో ..!
ప్రపంచం స్థంబించినట్టు
విలువైనదేదో పోగొట్టుకున్నట్టు
అరక్షణం అరచేతిలోని
అంతర్జాలం ఆగిపోతే
కలిగే భావనలు
వర్ణనాతీతం వేదనాభరితం
ఛార్జింగ్ డౌన్ అయినా
బాలెన్స్ నిల్ అయినా
నెట్వర్క్ ఆగిపోయినా
ఒక్క క్షణం కూడా
వుండనీదు ఊసుపోదు
ఎంత మాయ చేసావే..?
అందరినీ నీ బుట్టలో వేసుకుని
నీవు లేని క్షణమొక యుగమని
నీవు లేని జీవితమే లేదని
నిదుర లేచీ లేవకనే
కళ్ళు తెరచీ తెరవకనే
నీ జాడ కోసం
వెతికేను అరచేతులు
నీ స్పర్శకై తపించేను
నీ గొంతుక వినిపించనిదే
తెల్లారదు తనివితీరదు
అరచేయంత వున్ననూ
అద్భుతమైన ప్రపంచాన్నే
నీ వశం చేసుకున్న
అంతర్జాలమా!
నీకు హ్యాట్సాఫ్