అన్నదాత ఆకలి కేక. : కవీశ్వర్
అన్నదాత ఆకలి కేక. : కవీశ్వర్
అంశం :అన్నదాత ఆకలి కేక,
శీర్షిక : ఇచ్చుటలో ఉన్న హాయి .....: వచన కవితా సౌరభం : 11. 07. 2021
ఇచ్చుటలో ఉన్నాహాయి వేరెచ్చటనూ లేదోయి -
రైతన్న కృషి యే మిక్కిలి ప్రజోపయోగమేనోయి
ప్రకృతి కరుణాపూర్వక చైతన్యం సకల జనుల అభివృద్ధోయి
ప్రకృతి - వాతావరణ సమతౌల్యం మనిషి యొక్క కృషే నోయి
ఏరువాక నుండి రైతన్నలు పొలం పనులనారంభింతురోయి
విత్తనాలు,ఎరువులు , ఔషధాలువారికి దొరకడం కష్టతరమోయి
చచ్చి- చెడినారుపోసి పంటలను పండించి కల్లం పై రవాణా
అమ్మకం చేసినా వారి పెట్టుబడి - యేలుబడి వారల నిర్లక్ష్యమొయి
ఆనందంగా జీవించడానికి ప్రయత్నించినా సాధ్యం కాదోయి
రుణాల ఊబిలో కూరుకుపోయి , నిరాశా నిస్పృహల్లో గడిపేదరోయి
ఇంతజరిగినా రైతన్నలు పంటలను జనానికి ఇస్తున్నారోయి
జనుల ఆరోగ్యాభివృద్ధి రైతన్నల చేతులలోనే ఉన్నదోయి
జనులఆనందాన్నితమ ఖుశి గా తలచికృషిసల్పుతున్నారోయి
జీవన యాత్రలో ఎన్నెన్నో ఒడిదుడుకులు , కష్టనష్టాలోయి
తట్టుకున్న రైతు మొండితో తమ జీవనం సాగిస్తున్నాడోయి
లేనివారు తమ జీవితాన్ని అర్ధాంతరంగా చాలిస్తున్నారోయి
ప్రభుతకు , అధికారులకు అంత ధ్యాస, తీరిక ఎక్కడిదోయి?
ఎవరెలా పొతే పోనీ పోరా , రైతులు నాకేమి పట్టింపు లేదోయి
మొసలి కన్నీరు కారుస్తూ చేసిన పథకాలు నిజమైన రైతులకు
అందవోయి - ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నదోయి
వ్యాఖ్య : “రైతన్నల ఆకలి కేకలు దేశమంతటా వ్యాపించినా ,
ఉద్యమాలు చేసినా వారి అభివృద్ధి నాలుగడుగులు ముందుకి
-రెండడుగులు వెనక్కి అనే చందమోయి”
కవీశ్వర్
