STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Inspirational

3  

ARJUNAIAH NARRA

Abstract Inspirational

అంబెడ్కర్ ప్రపంచ మేధావి

అంబెడ్కర్ ప్రపంచ మేధావి

1 min
513


బ్రిటిష్ మ్యూజియం తెరువక ముందే ముందుండి మూసేటప్పుడు చివరి వరకు చదువుతుండి

గణితం, అర్థశాస్త్రం, న్యాయ శాస్త్రం

రాజకీయ శాస్త్రం, సాంఘిక శాస్త్రం

మరాఠీ సాహిత్యం, మానవీయ శాస్త్రాలు

చదివి డిగ్రీ మీద డిగ్రీ పదహారు డాక్టరేటు

పట్టాలే మకుటంగా ధరించి

దారిద్య్రం నుండి ధరణి మెచ్చిన

భారత దేశపు మణిపూసగా

ప్రపంచంమె గుర్తించే......


విందులు వినోదాలు విహారాలు

విలాసాలకు, విశ్రాంతిని నెరుగక

రోజుకు పద్దెనిమిది గంటల అధ్యయనం

నిరంతరం చదువులొనే నిమగ్నం

సమస్త విజ్ఞానం పుక్కిట బట్టి

అనుభవ జ్ఞానం, పుస్తక జ్ఞానం

రెండు మేళవించిన మేధావిగా

పోల్చదగిన వారు ప్రపంచంలో లేనే లేరు...


అగర్బ దరిద్రుడు, అంత్యజుడు

అమెరికాలో అత్యున్నత విద్య నొంది

ఆనాటి భారత రాజకీయ నాయకులలో

అగ్రగామి అంబెడ్కర్ అని

ప్రాచ్య పాశ్చాత్య పండితులే

ప్రశంసలు కురిపించగా......


అణగారిన బతుకులు కర్మఫలం కాదని

పిట్ట పలుకులను, పుక్కిటి పురాణాలను, 

కట్టుకథలను, కర్మకాండలను ప్రశ్నించి

మనువు వర్ణ ధర్మములను మట్టి కరిపించి

మనవత్వమే మనిషి మతమని నమ్మి


బ్రిటిష్ వారిని విమర్శిస్తూ

సవర్ణుల మనస్తత్వన్నీ సవరిస్తూ

నిమ్నజాతుల గొంతుకై నినదిస్తూ

అంటరాని హక్కులకై పోరాడుతూ

బారిస్టరుగా కోర్టులో వాదిస్తూ

భారత దేశ క్షేమాన్ని కోరే నాయకుడిగా

రాజకీయవేత్తగా , దేశ భక్తునిగా, నేతగా

దళిత జాతి ప్రతిభ పాటవాలకు ప్రతీకగా


మనుస్మృతికారుడు వెలివేసిన

కులం నుండి కలం పట్టుకొని

మనుస్మృతిని మంటకాల్చి

మరో శిక్షాస్మృతిని రాసిన

స్మృతికారుడు...అభినవ మనువు!

ఇది సృష్టి చిత్రమో ...విధి విచిత్రమో!!

అంత ఆశ్చర్యమె అంబెడ్కర్ జీవితం!!!


Rate this content
Log in

Similar telugu poem from Abstract