STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Classics Inspirational

అమ్మ తరువాతే!

అమ్మ తరువాతే!

1 min
400

అమ్మ తరువాతే!


త్యాగానికి తరువులే..గురువులు

కానీ!

తన పువ్వులను కోస్తున్నారని..

తన కొమ్మని నరుకుతున్నారని..

తన కాండాన్ని చీల్చుతున్నారని..

చెప్పుకోలేని..

ప్రతిస్పందన లే..లేని 

తరువులదే త్యాగమైతే!


అన్నీ తెలిసి తనకు తానుగా..

తన ఊపిరినే మనకి పోసి..

తన రక్తాన్ని మన శక్తిగా మలచి..

మన చేష్టలను సముద్రంలా సహించి..

మన తప్పులను దరిత్రిలా క్షమించి..


తన ప్రేమను..

అమృతంలా పంచుతున్న..అమ్మ

మన అమ్మను ఏమనాలి?

త్యాగం లో.. తరువులైనా..

అమ్మ తరువాతే!


సృష్టిలో..

దేనికైనా మారు రూపు ఉంటుందేమో

కానీ!

అమ్మకు మారు..రూపు అమ్మే!

ఆఖరికి ఆ సృష్ఠి కర్త కూడా..

ఆమె దగ్గర బొమ్మే!


      ......రాజ్.....


     



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy