STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Action Classics Inspirational

అమ్మ..నాన్న!

అమ్మ..నాన్న!

1 min
1K

అమ్మా..నాన్న!


అమ్మ ప్రాణ వాయవు 

అయితే..

నాన్న మన..ఆయువు


అమ్మ మన ఊపిరి..

నాన్న మన కాపరి.

అమ్మ మన కళ్ళు..

నాన్న మన కాళ్ళు.


అమ్మ మన గళం..

నాన్న మన బలం.

అమ్మ మన మనస్సు..

నాన్న మన మేథస్సు.


అమ్మ తలపు అయితే..

నాన్న మన గెలుపు.

అమ్మ మన సహనం..

నాన్న మన ప్రహసనం.


అమ్మ మన లక్ష్యం అయితే..

నాన్న దానికి సాక్ష్యం.

అమ్మ మన ఆత్మ అయితే..

నాన్న మన పరమాత్మ.


అమ్మ..నాన్న అని పిలిచే

అదృష్టానికి నోచుకోని..

అభాగ్యులుకు

ఆ అదృష్టం కలిగిన 

వారంతా బాసటగా ఉండాలని..

ఆశిస్తూ..


తమ సహనంతో నిరంతరంగా

నిస్వార్థ ప్రేమను కానుకగా 

అందిచే అమ్మా నాన్న లకి..

పాదాభివందనాలు తెలుపకుంటూ...

     

        ....రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Action