STORYMIRROR

THOUTAM SRIDIVYA

Abstract

4  

THOUTAM SRIDIVYA

Abstract

అమ్మ అలసి పోయాను....

అమ్మ అలసి పోయాను....

1 min
326


అమ్మ క్షమించవే...

నన్ను కడుపులో మోశావు

నేను నీ కడుపు నింపలేకపోయాను...


అమ్మ క్షమించవే...

రొమ్ముపాలు ఇచ్చావు

నేను నిన్ను ఆకలిపాలు చేశాను...


అమ్మ క్షమించవే...

గోరుముద్దలు తినిపించావు

నేను నీకీ ఓ ముద్ద పెట్టలేకపోతున్నాను...


అమ్మ క్షమించవే...

కూలీ చేసి మరి పెంచి పెద్దచేశావు

నిరుద్యోగ గ్రద్దనై పనిలేక రోడ్లపాలైయ్యాను 


అమ్మ క్షమించవే...

అనారోగ్యంతో మంచం పట్టావు

నీకు వైద్యం చేయించలేని వెదవనైయ్యాను...


అమ్మ క్షమించవే...

నేడు మాతృదినోత్సవమట 

కరోనా కోరల్లో పన్నెండుదాకే పని చేసి 

ఈ మందులు తెచ్చాను వేసుకో...


*పిచ్చినా తండ్రి నువ్వే నా పెద్ద మందు*

*దయ ప్రభువెవరో ఇంటి కొచ్చి అన్నం ఇచ్చి వెళ్ళాడు 

ముందు తిను...

నువ్వు నా కళ్ళ ముందుంటే 

ఈ రోగం నన్నేమి చేస్తుందిరా...

మందులకని మహమ్మారి మధ్యలో పనికి వెళ్ళావా...

వద్దు నాన్న కరోనా వంకతో శివుడు శివరాత్రి ఇచ్చాడురా మనకి...

ఇందా ఈ ముద్ద తిను...

నాకో ముద్ద పెట్టు 

నువ్వు నాకు అన్నం తినిపించడమె అసలైన 

అమృతము.....





Rate this content
Log in

Similar telugu poem from Abstract