అలసిపోయాను
అలసిపోయాను
అలసిపోయాను బంధాలను నిలుపుకోవడంలో
అలసిపోయాను మానసిక సంఘర్షణలలో
అలసిపోయాను ఆరోగ్యపరిరక్షణలో
అలసిపోయాను ఆర్ధిక స్థితి గతుల పోరాటంలో
అలసిపోయాను సంసార సాగర మధనంలో
అలసిపోయాను సామాజిక మాధ్యమాల అపార్ధాల నడుమ
అలసిపోయాను నన్ను నేనుగా మలచుకునుటలో
అలసిపోయాను కాలుష్యరహిత సమాజాన్ని వెతుకుటలో
అలసిపోయాను ఓర్పుగా నా మొరలాలకించిన ఆ భగవంతున్ని కీర్తించడంలో
