అలనై ...
అలనై ...
రేపటి వరకూ బతికుండాలంటే
నాకో ఆశ కావాలి
స్వప్నం కావాలి
ఇస్తావా
తీయటి మాట చెప్పి బతికించు
క్రాంతిలోకి తీసుకుపోయి అలరించు
అలక తీర్చు
నుదిటి మీద ముద్దు పెట్టు
సినిమాకు తీసుకెళ్ళు
పానీ పూరీ ఇప్పించు
చాట్ తినిపించు
చెరువుగట్టు మీద సంభాషణలలో
ఉద్దీప్తపర్చు
గుండెలో నివాసం ఏర్పర్చుకున్న
కలవరాలు
కలకలాలు
కలకాలం నిలవ్వని భరోసా ఇవ్వు
మంచి జీవితానికి హామీ ఇవ్వు
కొత్త ప్రపంచం స్రుష్టించు
నా కలలతో దాన్ని నిర్మించు
యుద్ధానికి శంఖం పూరించు
నువ్వు రమ్మంటే నేను రానా
రాక్షస వధ కోసం రాముడిలా
విశ్వానికి మిత్రుడనై నీ వెంట
అలలా ఉప్పొంగనా...
... సిరి ✍️❤️

