అల్లరి పిల్లోడు
అల్లరి పిల్లోడు
మజ్జిగ తాగి మీసాలు తెచ్చుకుంటాడు
ఆ మీసాలు అంటిస్తూ ముద్దులు పెడతాడు
బుడతడే కానీ సులభంగా దొరకడే
సింక్ ట్యాప్ వదిలేస్తాడు
దిండు కింద పడేసి తొక్కేస్తాడు
జడలోని పువ్వులు పీకి ఇల్లంతా పందిరేస్తాడు
ఇక పల్లెకు తీసుకువెళితే
కోడితో కొట్లాట మొదలుపెట్టి
మామిడిచెట్ల దగ్గర తేలుతాడు
అల్లరి పిల్లోడు ఈ అబ్బాయి
అని అమ్మకు చెబితే
వెనుక నుంచి మొట్టికాయ వేసి
తుర్రుమంటూ పరిగెట్టేస్తాడు