అక్షర జయం
అక్షర జయం


ప౹౹
అక్షర బద్దం చేయలేదు ఆ విజయం ఆనాడు
సంక్షిప్తంగానైనా చెప్పుకోలేదు నేనూ ఏనాడు ౹2౹
చ౹౹
అన్ని విజయాలు ఉత్తమమయినవే ఎంచగ
కొన్ని గెలుపులే మలుపు నిచ్చునూ మంచిగ ౹2౹
ఎదనే తాకిన ఎదురులేని ఒకనాటి ఆ కోరిక
మదిలోన మారాకునే వేసి పూచే చేసి తీరిక ౹ప౹
చ౹౹
అక్షర జయం అమరత్వము అని నా భావనే
లక్షల ఖర్చుతో కొనలేమే ఆ ఉన్నత ఊహనే ౹2౹
ఆశల అరలో అరమగ్గి అరవిరిసిన యోచన
విశాల దృక్పధం వైపు మార్చినే ఒక సూచన ౹ప౹
చ౹౹
స్టోరీమిర్రర్ ఇచ్చినే పిలుపునే కవితా పోటికీ
హిస్టరీ లో లిఖించేలా ప్రధముణ్ణైనా ధీటుగ ౹2౹
ఆ గుర్తింపు అమరత్వం అవునే నా దృష్టిలో వర్తమానంలో ఆ విజయమే గొప్పది సృష్టిలో
ప౹౹