అఖండ
అఖండ
*సముద్రాన్ని చూడు! చూడు!!*
సుడిగుండాలెన్ని వచ్చినా!
సముద్రమేమైనా జడియునా?
ఆటుపోట్లు సంభవించినా!
ఆత్మస్థైర్యం కోల్పోవునా?
సునామీలు చుట్టిముట్టినా!
కొంచెమైనా భీతిల్లునా?
అలలు అనిశం ఎగిసిపడినా!
తల్లి కడలి కోపించునా?
విశాల హృదయమే అంబుధిది
గగనమంత సహనం గలది
జల ప్రాణులకు ఆశ్రయమది
ఆణిముత్యాలకనువైనది
చూడు! సాగరాన్ని మానవా!!
వీడు! గుండెల్లో భయాన్ని
ఇకనైనా! నువ్వు మారవా!!
గాంచవా! అఖండ జయాన్ని!!
