STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మనోహర

మనోహర

1 min
5


పెదవి విప్పి చెప్పలేను..ఒక పాటగ పాడలేను..!
ప్రేమరుచికి రాగమేదొ..వెతికి స్వరం కట్టలేను..!

మూటకట్టి దాచేసిన..సిగ్గుపూల సిగ్గెంతో..
మాటలలో పెట్టలేను..గాలిలోన కలుపలేను..!

తొలిసారిగ నీ ఉనికిని..గుర్తెరిగిన పరవశమిది..
వర్ణించగ భాషలేదు..పద్యమందు నింపలేను..!

బొమ్మ గీసి చూపాలను..ఆరాటపు రూపమేదొ..
శిల్పముగా మలచలేను..కావ్యముగా వ్రాయలేను..!

సేదతీర్చు శుభవసంత..కళ్యాణిని అనునిత్యం..
నీ చూపుల వెలుగుతేనె..సేవించక ఉండలేను..!

నవమల్లెల వనసీమన..ఎదురుచూపు రాగమేదొ..
విరహగీతి ఆలపించు..కోకిలలా మనగలేను..!


Rate this content
Log in

Similar telugu poem from Classics