ఈ రోజుల్లో
ఈ రోజుల్లో
ఒకరుండాలి.
బాధ పడితే ఓదార్చడానికి.
జారే కన్నీటి నీ తుడవడానికి.
మనం అనుకోవడానికి.
ధైర్యం నూరిపొయ్యడానికి.
ఎద లోతుల్లో భారం దించడానికి.
సంతోషం మోసుకురావడానికి.
కొత్తలోకాన్ని పరిచయం చేయడానికి.
బాధను మరిపింప చేసి
ఆనందాలు మోసుకురావడానికి.
చెదిరిన దారుల్ని చక్కబెట్టడానికి.
మర్చిపోయిన రోజులను దూరం చేయడానికి.
కాని మోసం చేసి బాధ పెట్టి
గుండెను బరువు చేసే వాళ్ళు వచ్చి
బ్రతికున్నప్పుడే నరకం చూపించని
వాళ్ళు వస్తె సంతోషమే ఈ జీవితానికి..
