శివునితో దోస్తీ
శివునితో దోస్తీ


అన్ని లోకాల సామివి నీవంట
నీ మూడో కంట్లో అగ్గంట
నీ గొంతులోనేమో ఇషమంట
తల మీదేమో గంగమ్మంట
నువ్వుండేది మంచు కొండంట
నందీ భ్రుంగీ నీ ప్రమథ గణాలంట
నీ మనసు వరాల జల్లంట
మారేడాకులు నీ
నెత్తి మీద పెట్టి మ్రొక్కినామంట
పార్వతమ్మను తలచి
సోమవార వ్రతమును
చేస్తున్నామంట
ఇంక నీ మనసు మమ్మల్ని
గెలుసుకోనీవా అంట
ఉలకవు పలకవు ఎట్టంట
ఊ అనో ఆ అనో అనమంటా
నిన్ను భుజాన ఎత్తుకొని
ఊరేగుతామంట
హే శివ్ బోలే
నాతో దోస్తీ కట్టవా అంటా
శ్రీకాళహస్తీశ్వరా!