STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పీచ్చివాణీ

పీచ్చివాణీ

1 min
4


అర్థమింత లేని పాట..వ్రాసుకునే పిచ్చివాణ్ణి..!
ఉన్నదేదొ ఓ కలగా..చూసుకునే పిచ్చివాణ్ణి..!

వెతుకులాడ దొరికేదా..శాంతిపూల వనమేదో..
చూపలేని వేడుకలో..నవ్వుకునే పిచ్చివాణ్ణి..!

ప్రేమమత్తు మందంటే..కురుస్తున్న వెలుగేగా..
ఎదలోపల పొంగునదే..పంచుకునే పిచ్చివాణ్ణి..!

కాలపు వాకిట దిద్దిన..రంగవల్లి ఈ బ్రతుకు..
చెలి మోహన రాగమేదొ..పాడుకునే పిచ్చివాణ్ణి..!

నేర్చుకునే సంగతితో..తెగతెంపులు ఏమిలేవు..
నాతో నే నాటకమున..ఆడుకునే పిచ్చివాణ్ణి..!

అధికారపు పీఠానికి..కృతజ్ఞతలు ఎందుకంటె..
ఆయుధాల వ్యాపారం..చేసుకునే పిచ్చివాణ్ణి..!



Rate this content
Log in

Similar telugu poem from Classics