STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చిత్రాలు

చిత్రాలు

1 min
10


తాడెక్కు వాడుంటె..తలదన్ను వాడుండు..!
ఆటరా ఇది చూడ..చిత్రాల కథలుండు..!

గొప్పంటు ఏముంది..ఏ నిమిష మెవరిదో..
ఎగిరెగిరి పడితేను..ఎగతాళి ఎదురుండు..!

మనిషన్న వాడింత..ఎఱుకలో ఉండాలి..
'తురుంఖాన్' నేనంటె..సవాలై బతుకుండు..!

వలపుతో బంధమే..ఈ జన్మ గుట్టులే..
తలపు మాటున గాక..ఇంకెచట సుఖముండు..!

గెలుపెంత చిలిపిదో..కవ్వించు జాణయే..
గాయాల గేయమై..ప్రవహించు మధువుండు..!

వేదించు మాయతో..కలహించు మనసేల..
నిజమౌనమే గురువు..గమనించ తోడుండు..!



Rate this content
Log in

Similar telugu poem from Classics