కాలం ఓ మంత్రగతై
కాలం ఓ మంత్రగతై
కాలం అందమైన ఓ కిలాడీ
మనుషులతో ఆడుకునే వగలాడి
ఎంతటి వారైనా తనకే లోబడి
ముందుకు గెంటుతుంది కలబడి
ఓ పేదరాసి పెద్దమ్మలా,
ఓ మంత్రగత్తెలా ముగ్ధుని చేస్తుంది
కలల ప్రపంచానికి మహరాణిలా
బాహ్య ప్రపంచానికి మోసగత్తెలా
చిటెకలో మాయం చేసే అదృశ్య శక్తిలా,
జీవితాల్ని తలక్రిందులు చేసేస్తుంది
ఈ మాయగత్తె కాలానికి తలవొగ్గాల్లిందే
రాజైనా పేదైనా!
మనిషికి బాల్యపు కేరింతలు
అతి కొద్ది కాలమే!యవ్వనపు సౌందర్యం
ఇలా ఇచ్చి అలా లాగేసుకుంటుంది,
ఊరించి ఉడికిస్తుంది యవ్వన కాలాన్ని,
మంత్రమేసి లాగేస్తుంది ;కౌమార్యంలో
పిల్లలను చెడుగుడు లాడించేస్తుంది ;
వృద్ధాప్యాన్ని ఆపాదించి అశక్తుడిని చేసేస్తుంది
రెప్పపాటులో బతుకు పుస్తకం రాసేస్తుంది
కాసులతో కొనలేనిది కాలం ఒక్కటే !
చాప క్రింద నీరులా ప్రవహిస్తునే వుంటుంది
మనిషికి ఆరాటం పోరాటం కాల చక్రంలో
తప్పదు;ఏది ఏమైనా ఈ జీవిత మంత్రకత్తెకు
ఏ విశ్వవిజేతైనా గులాం కావల్సిందే
సలాం చేయకపోయినా నిష్కృమించాల్సింది
