ఓ మనసా
ఓ మనసా
బాధ తో గుండె బరువు చేస్తావు.
దుఃఖ సాగరం లో ముంచెతుతావు.
అందని దాని కోసం ఆరాటపడేలా చేస్తావు.
ఏదో మాయలో ముంచేస్తావు.
ఎదుగుతుంటే కుళ్ళుకుంటావు.
పక్కనే ఉంటు వేణుపోట్ల కు కరణమవుతావు.
నేను అనే అహాన్ని తీసుకొస్తావు.
స్వార్థాన్ని భాగం చేస్తావు.
ఎన్ని ఉన్నా కావాలనుకుంటావు.
ఆశ తో మాయలు చేస్తావు.
మంచి చేసే గుణం కన్నా చెడు ను ఆకర్షిచేల చేస్తావు.
అర్థం కాని ఆటలు ఆడిస్తావు కొత్తగా.
చూసింది కావులనుకుంటవు
ఆశలు రేపుతావు అగాధంలోకి తోస్తావు.
ఓర్వలేని గుణాన్ని ఒంటికద్ధుతావు.
పిడికెడంతా మనస్సు తో ఎన్నో ఆటలు
ఆడించి అదోగతి పాలు చేస్తావు ఓ మనసా..!
