STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కాలుష్యం

కాలుష్యం

1 min
5



అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన ప్రాణం తీసే కాలుష్యం 
అడుగులు ముందుకు వేద్దామంటే భూమిని కోసే కాలుష్యం 

నమ్మినవారితొ స్నేహంగుంటే మోసం చేసే మానవులం
చేయాచేయీ కలపాలంటే సంపద దోచే కాలుష్యం 

దేవుడు ఇచ్చిన వాయువు కూడా ఖరీదు చేసే దౌర్భాగ్యం 
గాలిని హాయిగ పీల్చాలంటే ముక్కుని మూసే కాలుష్యం 

మానవ మనుగడ నీరులేనిదే నిలకడగుండదు ఓ “చల్లా”
నీటిని మెండుగ తాగాలంటే గొంతుని కాల్చే కాలుష్యం 

ఒంటికి హాయీ కంటికి నిదురా కరువాయెనులే లోకంలో
తీయని కలలను కందామంటే కోరలు సాచే కాలుష్యం


Rate this content
Log in

Similar telugu poem from Classics