మధూరమే
మధూరమే
చెలికొఱకు పరుగులో చెలరేగు..గంధాల రాగాలు మధురమే..!
నా మనో సంద్రాన కదలాడు..వాక్యాల భావాలు మధురమే..!
గెలిచేది ఎవ్వరో ఓడేది..ఎవ్వరో యుద్ధాలు నిత్యమ్ము..
చంపేది చచ్చేది ఎవ్వరో..చిత్రాల కథనాలు మధురమే..!
అధికార కాంక్షతో మతితప్పి..చెలరేగు పథకాలు ఏమిటో..
క్షిపణులో ద్రోణులో రణతంత్ర..వ్యూహాల మరణాలు మధురమే..!
ప్రేమించు సంగతే చూపించు..కలహించు మార్గాలు వేవేలు..
నచ్చనిది నచ్చేను,సహనమే..తోడైన దోషాలు మధురమే..!
గజలంటె చూడంగ తత్వార్థ..ప్రాణాల నాట్యాల శిల్పమే..
మైత్రినే కాపాడు కాంతిలో..స్వప్నాల నాదాలు మధురమే..!
దేనితో బంధమో సంబంధ..మేదైన సరసాలు పండెనా..
దేహాన మోహమే మోసమే..పాశాల పాఠాలు మధురమే..!
