పోదునే
పోదునే
గాలిలో గాలికే..సాక్షినై పోదునే..!
నీటిలో రాతికే..కత్తినై పోదునే..!
కొమ్మలో కోకిలై..పుడితిలే లీలగా..
విరహమే తోడుగా..గీతినై పోదునే..!
చిలుకనై పువ్వునై..గంధమై బంధమై..
ఆటలో పావునై..రాయినై పోదునే..!
ఖర్మమే కాలమై.. బ్రతుకుగా మిగిలెనా..
శోకమే శ్లోకమై..స్వామినై పోదునే..!
పద్యమో గద్యమో..వ్రాయడం దేనికో..
గగనమే నవ్వగా..దేహినై పోదునే..!
నీవుగా నేనుగా..ఉన్నదే నిప్పులే..
మట్టికే అంటకే.. జ్ఞానినై పోదునే..!
